calender_icon.png 19 January, 2025 | 11:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీల అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

19-01-2025 12:00:00 AM

మూడు పురపాలికల్లో 21, 22, 23 తేదీలలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు 

పటాన్చెరు/రామచంద్రాపురం, జనవరి 18 : పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్, బొల్లారం, తెల్లాపూర్ మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 21, 22, 23 తేదీలలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

శనివారం పటాన్చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మూడు మున్సిపాలిటీల చైర్మన్లు, కమిష నర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెలాఖరులో మున్సిపాలి టీల పాలకవర్గాల గడువు ముగియనున్న నేపథ్యంలో పూర్తిచేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు నూతన పనులకు శంకుస్థాపన చేయను న్నట్లు  తెలిపారు.

వీటితోపాటు జలమండలి ద్వారా చేపట్టిన నూతన రిజర్వాయర్లను ప్రారంభించి  ఇంటింటికి రక్షిత మంచినీటి సరఫరాను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 

ఈ సమావేశంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, నాయకులు సోమిరెడ్డి, బాల్రెడ్డి, జలమండలి జీఎం సుబ్బారాయుడు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఉస్మాన్ నగర్ రైతులకు మెరుగైన నష్టపరిహారం అందజేస్తాం

తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్ రేడియల్ రోడ్డులో భూమిని కోల్పోతున్న రైతులకు మెరుగైన నష్టపరిహారం అందిస్తామని ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం ఉస్మాన్ నగర్ వార్డు కార్యాలయంలో రైతులు, హెచ్‌ఎండిఏ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పరిహారం అందిస్తే భూమిని ఇచ్చేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని వారు తెలిపారు. ఎమ్మెల్యే  మాట్లాడుతూ శర వేగంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఉస్మాన్ నగర్ నుంచి వట్టినాగులపల్లి వరకు  రేడియల్ రోడ్డు అత్యంత కీలకమని తెలిపారు.

ఉస్మాన్ నగర్ పరిధిలో కొంతమంది రైతులు భూమి ఇవ్వకపోవడం మూలంగా రోడ్డు పనులు నిలిచిపోయాయని, భూమి కోల్పోతున్న ప్రతి రైతుకు ప్రభుత్వంతో చర్చించి మెరుగైన నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. రైతులను కాపాడుకునే పూర్తి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.

స్పందించిన రైతులు భూములు ఇచ్చేందుకు సమ్మతించారు. ఈ సమావేశంలో హెచ్‌ఎండిఏ ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్ రెడ్డి, స్థానిక నాయకులు చిట్టి ఉమేష్, పర్సా శ్యామ్ రావు, రైతులు పాల్గొన్నారు.