30-03-2025 05:46:57 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి సమీపంలోని గంగమ్మ వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయాలని రామారెడ్డి గ్రామస్తులు ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావుకు వినతి పత్రాన్ని అందజేశారు. గత ఏడాది క్రితం పనులు ప్రారంభించి అర్ధాంతరంగా పనులు కాంట్రాక్టర్ నిలిపివేశారని గ్రామస్తులు తెలిపారు. నిధులు లేక పనులు చేయడం లేదని కాంట్రాక్టర్ పై చర్య తీసుకొని పనులు పూర్తి చేయించాలని రామారెడ్డి గ్రామస్తులు ఎమ్మెల్యే మదన్మోహన్ రావును కోరారు. వర్షాకాలంలో పనులు పూర్తిచేస్తే ఇబ్బందులు తగ్గుతాయని లేకుంటే తీవ్రంగా 10 గ్రామాల ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే చర్యలు తీసుకుని బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయించాలని ఎమ్మెల్యేని కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఎమ్మెల్యే మదన్మోహన్ రావు పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.