calender_icon.png 23 December, 2024 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాసంగి పంటకు నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే

22-12-2024 08:11:41 PM

గుత్ప ఎత్తిపోతల పథకం నుండి యాసంగి పంటకు 135 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి...

నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఉమ్మడ గ్రామ శివారులోని అర్హులు రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం నుండి యాసంగి వంట సాగుకై 135 క్యూసెక్కుల నీటిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదివారం రోజు విడుదల చేశారు. రైతులు యాసంగి పంట నిమిత్తం నీటిని పొదుపుగా వాడాలని కాలువ పరివాహక రైతులు ఎటువంటి విభేదాలు లేకుండా పరస్పర అవగాహనతో పంటలు సాగు చేసుకోవాలని రైతులకు రాకేష్ రెడ్డి సూచించారు. కబ్జాలకు గురైన చెరువుల వివరాలను సేకరించి వాటిని వెంటనే తొలగించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.