calender_icon.png 18 March, 2025 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి

18-03-2025 01:11:09 PM

-చెరువులకు మరమ్మత్తులు చేయించండి

బైంసా, (విజయక్రాంతి): రెండు సంవత్సరాల క్రితం ముధోల్ నియోజక వర్గం(Mudhol Assembly constituency)లో కురిసిన భారీ వర్షాలతో వంద చెరువులు దెబ్బతిన్నాయని, దీంతో భూగర్భ జలాలు అడుగంటి ప్రజలు తాగునీటికి రైతులు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మంగళవారం శాసనసభ సమావేశం(Telangana Legislative Assembly)లో జీరో అవర్ లోఆవేదన వ్యక్తం చేశారు.

చెరువుల మరమ్మత్తులకు(Pond repairs) నిధులు ఇవ్వాలనిమంత్రుల చుట్టూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ  చెప్పులు అరిగేలా తిరుగుతున్న  సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. హిప్నెల్లి చెరువు మరమ్మత్తులకు 60 లక్షల రూపాయల నిధులు, దొడర్న చెరువుకు 90 లక్షల రూపాయల  నిధులు మంజూరైనప్పటికీ  ఇప్పటివరకు ఫైనాన్స్  క్లియరెన్స్ కావడం లేదన్నారు. బాసర సరస్వతి ఆలయానికి(Basara Saraswathi Temple) గతంలో మంజూరైన నిధులు వెనక్కి వెళ్ళిపోయాను అన్నారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి నిధులు మంజూరు చేసి ప్రజల సమస్యలను తీర్చాలని విజ్ఞప్తి చేశారు.