11-02-2025 05:43:36 PM
తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం గ్రామంలో గత పదిరోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయిన రెగటి శివకుమార్ తల్లి రెగటి సత్తెమ్మ అనారోగ్యంతో చనిపోయినందున వారి దశదినఖర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించిన మల్కాజ్గిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి. శివకుమార్ కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య, జిల్లా నాయకులు గుండాగానీ రాములు గౌడ్, గ్రామ నాయకులు పులుసు ఉప్పలయ్య, అకారపు భాస్కర్, కొల్లూరి మహేందర్, డీలర్ ఉప్పలయ్య, డీలర్ వెంకన్న, రెగటి ఎల్లయ్య, ఉప్పుల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.