calender_icon.png 29 November, 2024 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నం కూరలు నాసిరకంగా ఉన్నాయంటూ ఎమ్మెల్యే ఆగ్రహం

29-11-2024 07:28:28 PM

స్వయంగా వండిన అన్నం, కూరలను పరిశీలన

మరోసారి హాస్టల్ కు వస్తా భోజనం నాణ్యత లేకపోతే చర్యలు తప్పవు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మెస్ చార్జీలు పెంచినప్పటికీ  భోజనంలో  నాణ్యత లేదంటూ ఏజెన్సీ నిర్వాహకులపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల హాస్టల్ ని ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు.విద్యార్థినుల కోసం వండిన అన్నాన్ని, కూరలను, సాంబారు, పెరుగును స్వయంగా రుచి చూసి పరిశీలించారు.

అన్నం మాడిపోవడంతో వంట తయారీ ఏజెన్సీ వై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలు, పెరుగు ఎక్కడి నుండి వస్తున్నాయని పెరుగు ఇంత పుల్లగా ఎలా ఉంటుందని అధికారులను ప్రశ్నించారు. మెస్ చార్జీలు, కాస్మటిక్ చార్జీలు పెంచిందని, పెంచిన తర్వాత కూడా భోజనం నాసిరకంగా ఉంటే ఊరుకోమని హెచ్చరించారు. హాస్టల్లో స్వయంగా అన్నం కూరలు  విద్యార్థినులకు వడ్డించి  ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థినులను అడిగి  తెలుసుకున్నారు. మరో మారు ఈ హాస్టల్ కి వస్తానని భోజనం నాణ్యతతో లేకపోతే ఊరుకోమని హెచ్చరించారు.