పోలీసుల వైఫల్యమే కారణం
హైదరాబాద్: అల్లు అర్జున్ అరెస్టును బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బాధ్యులు కాదని ఆయన పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటన ప్రభుత్వం వైఫల్యం వల్లే జరిగిందని రాజాసింగ్ వెల్లడించారు. తొక్కిసలాట ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమన్నారు. అల్లు అర్జున్ ను నేరస్తుడిగా చూడటం సరికాదని సూచించారు. అర్జున్ జాతీయ అవార్డు సాధించి తెలుగు వారి ప్రతిష్ఠ పెంచారని తెలిపారు. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్‌ను చీకడపల్లి హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 4న ఆయన చిత్రమైన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఈ ఘటన జరిగింది.