calender_icon.png 4 March, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత ప్రభుత్వం లక్ష్మీ నగర్ ప్రాంతానికి బొందల గడ్డగా మార్చింది

04-03-2025 04:47:20 PM


40 ఏళ్లలో లక్ష్మీ నగర్ ప్రాంతంలో 40 ఫీట్లతో రోడ్ల నిర్మాణం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

రామగుండం,(విజయక్రాంతి): గత ప్రభుత్వం లక్ష్మీ నగర్ ప్రాంతానికి బొందల గడ్డగా మార్చారని ఆ విషయం గోదావరిఖనిలోని లక్ష్మి నగర్ వ్యాపారులకు తెలుసని, 40 ఏళ్లలో లక్ష్మీ నగర్ ప్రాంతంలో 40 ఫీట్లతో రోడ్ల నిర్మాణం పనులు చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్(MLA Makkan Singh Raj Thakur) అన్నారు. గోదావరిఖనిలో మేదర్ బస్తి, ఉల్లిగడ్డ బజార్, అబ్దుల్ కలాం స్టాచ్యూ, కళ్యాణ్ నగర్, లక్ష్మీ నగర్, వెంకటేశ్వర సైకిల్ టెక్స, లో (టీయూఎఫ్ ఐడిసి) నిధుల నుండి రూ. 29.5 కోట్లతో యు జి డి, సెంట్రల్ లైటింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనే, మరియు రోడ్స్, పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ... ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం మడమ తిప్పకుండా లక్ష్మీ నగర్ వ్యాపారస్తుల సహకారంతో అభివృద్ధి  చేస్తున్నామని, లక్ష్మీ నగర్ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్, వాటర్ లైన్, జరుగుతున్న పనుల వల్ల కొంత ఇబ్బంది పడ్డ పూర్తిస్థాయిలో రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఆలోచించి 30 నుండి 40 సంవత్సరాల వరకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు నడవడం జరుగుతుందని,  మన లక్ష్మీ నగర్ ను ఇంకా అద్భుతంగా చేసే విధంగా దృష్టిలో పెట్టుకొని ఈరోజు లక్ష్మీ నగర్ ప్రాంత వ్యాపారస్తుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుంది.

గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే లక్ష్మీ నగర్ ప్రాంతంలో అభివృద్ధి వెనుక పడడానికి కారణం గత పాలకుల నిర్లక్ష్యమేనని ప్రజలు అధికారులు చెప్తున్నారని, ఎన్నడు లేనివిధంగా ఎక్కడ లేని విధంగా పకడ్బందీగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. దయచేసి లక్ష్మీ నగర్ ప్రాంత ప్రజలు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించి ఈ రాష్ట్రంలో  నియోజకవర్గానికి ముందు భాగంలో ఉండే విధంగా చేసుకొని బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. రోడ్లను లక్ష్మీ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైనా కానీ ఇతర పనుల కోసం రోడ్లను పగలగొట్టే ప్రయత్నం చేస్తే మున్సిపల్ అధికారులు ఐదు లక్షల రూపాయలు జరిమానా వేస్తారని హెచ్చరించారు. ఈ రోడ్లను కాపాడుకునే బాధ్యత మీ అందరి పైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు.