calender_icon.png 18 January, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామగుండంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే

26-08-2024 03:43:36 PM

పెద్దపల్లి,(విజయ క్రాంతి): రామగుండం నియోజకవర్గంలోని ప్రజలకు ఏ ఆపద వచ్చిన నిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ అన్నారు. సోమవారం గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాల్లోని  అనారోగ్యం తో ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థిక నష్టపోయిన లబ్ధిదారులకు సిఎం సహాయక నిధి చెక్కులను రూ. 61, 70000 (అరవై ఒక్క లక్ష డెబ్బై వెలు)  చెక్కులను కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ... సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు రామగుండం మండలం లో 108,  పాలకుర్తి మండలంలో 32, అంతర్గాం మండలంలో 30 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.