27-04-2025 02:44:09 PM
ఇల్లెందు, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పూబల్లి పంచాయతీలో పైలెట్ ప్రాజెక్టు కింద 83 ఇండ్లు మంజూరు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ నిర్మాణ పనులను ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వెంటనే లక్ష రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు. వీలైనంత తొందరగా ఇందిరమ్మ ఎండ్లు నిర్మాణ పనులు పూర్తి చేయాలని లబ్ధిదారులు దగ్గరుండి మరి పరిశీలించి నాణ్యతగా కట్టుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, మాజీ ఎంపిటిసి పూణెం సురేందర్, డి శివ, బానోత్ శారదా, నరసింహారావు, ధనుంజయ్, చీమల బక్కయ్య, జోగ శ్రీకాంత్, అధికారులు ఏఈ డేవిడ్, సెక్రటరీ బాలకృష్ణ, గ్రామ ప్రజలు, పెద్దలు పాల్గొన్నారు.