calender_icon.png 24 February, 2025 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యవసర చికిత్స నిమిత్తం 5 లక్షల ఎల్ఓసి చెక్కు అందించిన ఎమ్మెల్యే

19-02-2025 06:09:59 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని కళ్యాణి గ్రామానికి చెందిన ఆకుల వెంకటి అనారోగ్యానికి గురి కావడంతో మంగళవారం నాడు హైదరాబాదుకు తరలించి నిమ్స్ హాస్పటల్ లో చేర్పించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, అత్యవసరంగా మెరుగైన వైద్యం అందించాలని తెలపడంతో వారి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, కళ్యాణి గ్రామ అధ్యక్షులు సంజీవులు ద్వారా స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావును సంప్రదించి అత్యవసర చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మదన్మోహన్ రావు 5 లక్షల రూపాయల ఎల్ఓసి చెక్కును బాధితుని తనయుడు ఆకుల నాగరాజుకు అందజేశారు. అనంతరం బాధితుని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.