calender_icon.png 15 January, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూస్తాం

09-09-2024 04:58:07 PM

త్వరలోనే మంచిర్యాలలో 650 వడకల ఆనువత్రి

మంచిర్యాల ఎమ్మెల్యే పిఎస్ఆర్

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. వరదల కారణంగా కాలేజ్ రోడ్ లోని ఎంసీహెచ్ ను జీజీహెచ్ లోకి తరలించడం వల్ల రోగులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా! సేవలు ఎలా అందుతున్నాయని రోగులను, గర్భిణీలను, బాలింతలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని వార్డులన్నింటిని తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే మంచిర్యాలలో 650 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని, హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లకుండా మంచిర్యాలలోనే కార్పొరేటు స్థాయి వైద్య సేవలు అందుతాయన్నారు. వైద్యులను ఓపీ, ఇన్ పేషెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్ హరిశ్చంద్రా రెడ్డి, ఆర్ఎంఓలు, వైద్య సిబ్బంది తదితరులున్నారు.