25-03-2025 01:15:54 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ సమావేశాలల్లో భాగంగా మూడోరోజు బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది. పద్దులపై చర్యలో బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉద్వేగంగా మాట్లాడారు. అతికొద్ది మందికి దక్కే గౌరవాన్ని తాను పొందినన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో మూడుసార్లు ఎమ్మెల్యే అయినట్లు గుర్తు చేసుకున్నారు. నాలుగేళ్లు మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ గా, ఐదేళ్లు మంత్రిగా భగవంతుడు తనకు ఇచ్చిన శక్తి మేరకు పని చేశానని పేర్కొన్నారు. సభలో మాట్లాడుతుంటే సభ్యులు అంతరాయం కలిగిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ శాసనసభలో మంత్రులు విద్య, వాణిజ్య పన్నలు, ఎక్సైజ్, పర్యాటకం, క్రీడలు-యువజన సర్వీసుల పద్దులు, ఆర్అండ్బీ, అటవీ, దేవదాయశాఖల పద్దులను ప్రవేశపెట్టారు.