calender_icon.png 21 January, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య రంగానికి పెద్దపీట ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

21-01-2025 01:33:54 AM

రాజేంద్రనగర్, జనవరి 20: వైద్య రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్‌ఎండిఏ నిధులు రూ.50 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న, కొనసాగుతున్న పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేశారు. రూ.5 కోట్ల తో  నిర్మిచనున్న 50 పడకల ఆస్పత్రి భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.

రూ.2 కోట్ల 95 లక్షలతో నిర్మించనున్న అవుట్ డోర్ స్టేడియం పనులకు ఆయన శంకుస్థాపనల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. గడిచిన 5 సంవత్సరాలలో శంషాబాద్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల  ఎన్నికల్లో విజయ డంకా మోగించి శంషాబాద్ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.

పార్టీలకు అతీతంగా నాయకులందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్  సుష్మా మహేందర్ రెడ్డి,  వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, పలువురు కౌన్సిలర్లు, కమిషనర్ సుమన్ రావు పాల్గొన్నారు.