కామారెడ్డి, నవంబర్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం రు ద్రూర్ మండలం లక్ష్మాపూర్ క్యాం పు గ్రామం నుంచి అక్బర్ నగర్ గ్రామం వరకు రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివా స్రెడ్డి మంగళవారం భూమి పూజ చేశారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే రెండు గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఆయ న అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవే శపెట్టి రైతులకు, ప్రజలకు మేలు చేస్తున్నారన్నారు. సొంత స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు.