calender_icon.png 30 January, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్న

26-01-2025 12:45:52 AM

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి

కామారెడ్డి,(విజయక్రాంతి): బాన్సువాడ పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ది చేస్తున్నానని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ పురపాలక సంఘ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హజరై మహత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన పురపాలక సంఘ పాలకవర్గ సభ్యులు వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. బాన్సువాడ పట్టణ తోలి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన వ్యక్తి జంగం గంగాధర్ అని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కంటే బాన్సువాడ మున్సిపాలిటి ఒక అడుగు ముందంజలో ఉందని తెలిపారు. రాజకీయంగా పదవులు వస్తాయి, పోతాయి కానీ చేసిన పని శాశ్వతంగా ఉంటుందన్నారు. పారిశుద్ద్యం, తాగునీరు,విద్యుత్ దీపాల పరిష్కారం చేశామన్నారు.

మౌళిక సదుపాయాలను కల్పించే బాధ్యత ఎమ్మెల్యేదే అయినప్పటికి దానిని పూర్తిస్థాయిలో మెరుగుగా నడిచేలా చూసే బాధ్యత మున్సిపాలిటి కౌన్సిల్‌దే అన్నారు. అందరి మన్ననలు పొందేలా పనిచేసిన పాలకవర్గ సభ్యులకు ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. రాబోవు రోజుల్లో ఎన్నికలు వచ్చే వరకు సబ్ కలెక్టర్, మేము ఉంటామని తెలిపారు. జరిగిన అభివృద్ది పనులు చెప్పక తప్పదని, వేరే వేరే పార్టీలలో ఉండవచ్చని కానీ కలిసి పనిచేసి సంస్కృతి బాన్సువాడలో ఉందన్నారు. ఐదేండ్లు విమర్శలు,మనస్థార్దాలు లేవని తెలిపారు. ఏ పనిచేయాలన్న ప్రజలు, అధికారుల సహకారం లేనిది ఏం చేయలేం అన్నారు. మున్సిపాలిటి పరిధిలో 650 కొట్ల రూపాయిలు అభివృద్దికి వెచ్చిద్దామని తెలిపారు. గత ప్రభుత్వ సహకారంతో పనిచేశాంమని ఆగిపోయిన పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారి సహకారంతో నిధులు సమకూర్చుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల తరువాత రేవంత్‌రెడ్డి కొత్త ప్రభుత్వ ఏర్పాట్ల తర్వాత 10 కొట్లు మంజూరు చేశారన్నారు. ఒక వార్డును ఆదర్శంగా తిర్చిదిద్ది పట్టణ ప్రజలకు పరిశుభ్రత గురించి వివరించాలనే యోచన, శుభ్రత ద్వారా ఆరోగ్య పరిరక్షణ జరుగుతుందన్నారు.

ఎమ్మెల్యేగా అయిన సమయంలో బాన్సువాడలో రెండే మంచి నీటి ట్యాంకులు ఉండేవని, ఇప్పుడు 52 కొట్లతో అమృత్ 2.0 పథకం ద్వారా బాన్సువాడలో 50 లక్షల లీటర్ల పైచిలుకు కెపాసిటితో తాగునీటి ట్యాంకులు నిర్మాస్తామని, రాబోయే 50 సంవత్సరాల  వరకు బాన్సువాడ పట్టణానికి తాగునీటి ఎద్దడి లేకుండా చేస్తామన్నారు. బాన్సువాడలో సుమారు 600 మంది మాత్రమే ఇండ్ల కోసం వారు సభలలో ధరఖాస్తులు పెట్టుకున్నారన్నారు. ఇండ్ల అవసరం చాలా తక్కువగా ఉందని గ్రహించామని వారికి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. ఈ 5 లక్షల రూపాయల ఇంటి ఆడబిడ్డ పేరుతో పూర్తిగా ఎటువంటి టాక్సులు లేకుండా లబ్దిదారుల అకౌంట్‌లోకి జమచేయడం జరుగుతుందన్నారు. అనంతరం బాన్సువాడ పట్టణంలో నూతనంగా నిర్మించిన వైకుంఠదామం(హిందు స్మశానవాటిక)ను స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర  అగ్రోకార్పోరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.