కామారెడ్డి,(విజయక్రాంతి): కులమతాలకు అతీతంగా బడాపహాడ్ ఉర్సు ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం జలాల్‌పూర్‌లోని బడాపహడ్‌లో ఉర్సు ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా షాదుల్లా ఉసేన్ బాబాకు నైవేధ్యాన్ని సమర్పించారు. అంతకు ముందు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా తిలకించారు. గుర్రంపై నైవేథ్యాన్ని లొంక తీర్దం నుంచి బడాపహడ్ షాదుల్లా ఉసేన్ బాబాకు తీసుకొచ్చి భక్తులు సమర్పించారు. మూడు రోజుల పాటు ఉర్సు ఉత్సవాలు కొనసాగనున్నాయి. తెలంగాణ, మహరాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి బడాపహడ్ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొంటారు.మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత కూడా హజరు కానున్నట్లు తెలిపారు.