కామారెడ్డి,(విజయక్రాంతి): 3.5 కొట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులను బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని 10వ వార్డు సాయికృష్ణనగర్ కాలనిలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్పాస్ట్రక్చర్ డెవలఫ్‌మెంట్ కార్పొరేషన్ నిధులు 3 కొట్ల 5 లోల రూపాయలతో నిర్మించబోయే సీసీ రొడ్డు, డ్రైనేజీ పనులకు భూమి పూజ కార్యక్రమాలలో ముఖ్య అతిధిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. పూజ కార్యక్రమాలలో ముఖ్య అతిధిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర అగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, మున్సిపల్ చైర్మన్ జగంగం గంగాధర్, పట్టణ ప్రజాప్రతినిధులు నాయకులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.