calender_icon.png 7 November, 2024 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది

03-11-2024 04:13:44 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): రైతులు పండించిన ప్రతి గింజలు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్, కొల్లూరు, నాగారం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని దళారులకు విక్రయించి రైతులు మోసపోవద్దని కోరారు.

ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను పొందాలని రైతులను ఆయన కోరారు.  రైతు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. మధ్య దళారుల మాటలు విని మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, విండో చైర్మన్లు కృష్ణారెడ్డి, మోహన్ నాయక్, శ్రీధర్, శ్రవణ్, నరహరి, నారాయణరెడ్డి రైతులు పాల్గొన్నారు.