calender_icon.png 19 April, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే పోచారానికి బుద్ధి చెప్పాలి

11-12-2024 01:10:28 AM

మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

కామారెడ్డి, డిసెంబర్ 10 (విజయక్రాం తి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బుద్ధి చెప్పాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉద్యమంలో ఏనాడు పోచారం పాల్గొనకున్నా.. పోచారం శ్రీనివాస్‌రెడ్డి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మాజీ సీఎం కేసీఆర్ ఆదరించి, మంత్రి పదవితోపాటు శాసనసభాపతి పదవులు ఇచ్చారని చెప్పారు.

కానీ బీఆర్‌ఎస్ కష్టకాలంలో ఉన్న సమయంలో కేసీఆర్‌కు అండ గా నిలవాల్సింది పోయి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లో చేరారన్నారు. నమ్మక ద్రోహం చేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలంటూ బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు బాజిరెడ్డి పిలుపునిచ్చారు.

ఏడాది గడిచినా రైతు భరోసా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలకు హమీ ఇచ్చిన ఏ ఒక్క పథకం కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. అనంతరం తెలంగాణ తల్లికి క్షీరాభిషేకం చేశారు. ఆయ న వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, గణేష్ ఉన్నారు.