calender_icon.png 8 January, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రబీలో ఆయకట్టు రైతులందరికి సాగు నీరు అందించాలి

06-01-2025 11:43:33 PM

రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం

రాష్ట్రప్రభుత్వ వ్యవసాయ  సలహదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి

కామారెడ్డి,(విజయక్రాంతి): నిజాంసాగర్ ప్రాజెక్ట్(Nizamsagar Project) ఆయకట్టు పరిధిలోని రైతులకు రబీ పంటలకు సాగునీరు పూర్తిస్థాయిలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వ వ్యవసాయ  సలహదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి(Banswada MLA Pocharam Srinivas Reddy) అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా పరిధిలోని నిజాంసాగర్ ఆయకట్టు రైతులు ఉన్నారని రబీ పంట(Rabi Crop)కు కావాల్సిన నీరు అందుబాటులో ఉందని, పంటలు ఎండకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని కొరారు.ఏ ఏ పంటలు పండుతాయో వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది కల్గకుండా సాగునీరు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అగ్రో కార్పోరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బోధన్ సబ్‌కలెక్టర్ వికాస్ మహత, నిజాంసాగర్ ప్రాజెక్ట్ సీఈ శ్రీనివాస్, ఎస్సీ రాజశేఖర్, ఈఈ బలరాం, డిఈలు జగదీష్, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, తహశీల్దార్‌లు, ఇరిగేషన్ ఏఈలు పాల్గొన్నారు.