calender_icon.png 21 December, 2024 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటోంది

14-10-2024 04:55:26 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): రైతులు పండించిన ప్రతి గింజలు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సన్న రకం పండించిన రైతులకు క్వింటాలకు 500 అదనంగా బోనస్ ఇస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే పోచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎటువంటి నష్టం జరుగకుండా చూసుకుంటుందని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు దళారులకు ధాన్యాన్ని విక్రయించవద్దని, తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోకూడదని తెలిపారు. ఏ ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి 2320 క్వింటాలకు చెల్లిస్తుందని, కామన్ గ్రేడ్ ధాన్యానికి 2300 లకు కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం క్వింటాలకు వానకాలంలో పండించిన సన్నారకం దాన్యానికి 500 బోనస్ చెల్లిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.