ఆడబిడ్డల తల్లితండ్రులకు ఆసరాగా నిలుస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి
కామారెడ్డి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణలక్ష్మి(Kalyana Lakshmi), షాదీ ముబారక్(Shaadi Mubarak) పథకం ఆడపిల్లలను తల్లితండ్రులకు ఎంతో ఆసరా ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పోతంగల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన 90 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహయంఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. పేదింటి ఆడపడుచు పిల్లలు గల తల్లితండ్రులు కళ్యాణలక్ష్మి షాదిముబారక్ ముబారక్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం పోతంగల్ మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయాన్ని వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం వర్ని మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లు, మాడల్ హౌజ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. పోతంగల్ మండలంలో 62 మంది లబ్దిదారులకు రూ.62,07,192, వర్ని మండలంలో 16 మంది లబ్దిదారులకు రూ.16,01,856, చందూర్ మండలంలో 12మంది లబ్దిదారులకు రూ.12,01,392 కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రో కార్పోరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, మార్కెట్ కమిటి చైర్మన్‌లు గైక్వాడ్ హనుమంతు, సురేష్‌బాబా, ఇంచార్జి తహశీల్దార్ సురేందర్ నాయక్, మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పప్పుల శంకర్, నాయకులు సిరాజుద్దీన్, చాంద్‌పాషా, కేశ వీరేశం, గంథం పవన్‌కుమార్, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, లబ్దిదారుల తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.