05-04-2025 06:13:19 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అయ్యప్పకు అభిషేకం పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కారుకూరి రా0చందర్, తదితరులు పాల్గొన్నారు.