calender_icon.png 27 November, 2024 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్దీపక పుస్తకాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాయం

27-11-2024 05:45:30 PM

మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని గుట్ట మల్లారం గ్రామంలోని జిపిఎస్ పాఠశాలల్లో ఐటీడీఏ ద్వారా రూపొందించిన ఉద్దీపకము ఇంగ్లీష్, గణితం విద్యార్థుల వర్క్ బుక్ ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాలలోని గిరిజన విద్యార్థినీ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక వసతి సౌకర్యాలతో ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాలు, గురుకుల పాఠశాల, కళాశాలలు నెలకొల్పిందని, ఈ సంవత్సరం ప్రైవేట్ కళాశాలకు పాఠశాలలకు దీటుగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిందని అన్నారు. గిరిజన విద్యార్థిని విద్యార్థుల విద్య బలోపేతం కావడానికి ఈ ఉద్దీపకములు ఎంతో ఉపకరిస్తాయని సంబంధిత ఉపాధ్యాయులు తప్పనిసరిగా ప్రతిరోజు పిల్లలకు వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలని అన్నారు.

అనంతరం ఐటీడీఏ పీవో బి రాహుల్ మాట్లాడుతూ.. ముఖ్యంగా జిపిఎస్ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఇంగ్లీషులో చదవడం రాయడం గణితంలో చతుర్విధ ప్రక్రియలు చేయడంలో వెనుకబడుతున్నట్లు ఆకస్మిక తనిఖీలలో గ్రహించడం జరిగిందని, నిష్ణాతులైన ఉపాధ్యాయులచే వంద రోజుల ప్రణాళిక ద్వారా ఈ ఉద్దీపకములు రూపొందించడం జరిగిందని అన్నారు. విద్యార్థిని విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ వర్క్ బుక్స్ ను రూపొందించామని తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జిపిఎస్ పాఠశాలల్లో 5,598 మంది చదువుతున్న విద్యార్థుల్లో విద్య ఊహించలేనంతగా లేకపోవడంతో విద్యార్థులు వెలుగు నింపేందుకే ఈ ఉద్దీపక పుస్తకం రూపొందించామని, ఈ ఉద్దీపకం పుస్తకం వలన విద్యార్థుల్లో దీపం వెలుగు నింపడానికి ఈ పుస్తకం పుట్టుకొచ్చిందని, డిడి ఎ టి డి ఓ కొంతమంది టీచర్లు సహకారంతో 10 రోజుల కష్ట ఫలితమే ఈ ఉద్దీప పుస్తకం అని విద్యార్థినీ విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని విద్యను బలోపేతం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఏటీడీఓ అశోక్ కుమార్, ఎంఈఓ స్వర్ణ జ్యోతి, ఎస్ సి ఆర్ పి గాంధీ, తాసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, హెచ్ఎం ముత్తయ్య, కార్యదర్శి దుర్గాభవాని, మణుగూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.