మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని అరుంధతి నగర్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం పినపాక ఎమ్మెల్యే పాయం(MLA Payam Venkateshwarlu) ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చుట్టు ప్రహరీ గోడ, పాఠశాల తరగతి గదులను పరిశీలించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఉన్నతమైన విద్యను బోధించాలని విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని ఉపాధ్యాయులకు సూచించారు. స్కూల్ కి సంబంధించి ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, నీలకంఠేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ కూచిపూడి బాబు, నాయకులు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.