calender_icon.png 23 February, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లింగమంతుల స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే పాయం

18-02-2025 12:00:00 AM

సాంప్రదాయ నృత్యాలతో బాజా భజంత్రీలతో ఘనస్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు

బూర్గంపాడు/అశ్వాపురం, ఫిబ్రవరి17(విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మణుగూరు-అశ్వాపురం సరిహద్దు అడవి ప్రాంతంలో ఉన్న లింగమంతుల స్వామి వారి జాతరకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.ఆలయ కమిటీ సభ్యులు సాంప్రదాయ నుత్యాలతో భాజా భజంత్రీలతో ఘన స్వాగతం పలికారు.అనంతరం లింగమంతుల స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా ప్రసిద్ధి చెందిన లింగ మంతుల జాతరను ఇంత ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులను అభినందించారు. ప్రతి ఏడాది లింగమంతుల స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకుం టున్నారని భక్తుల కోరికలను తీర్చే ఆరాధ్య దైవంగా భావిస్తున్నారని లింగమంతుల స్వామి వారి గుడి దినదినం గా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

స్వామివారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా కలిగేలా చూడాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. అనం తరం జాతరకు వచ్చిన భక్తులకు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం పాల్గొని భక్తులకు భోజనా లను వడ్డించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ర్ట కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య, అశ్వాపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓుంగంటి బిక్షమయ్య, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నవీన్, మణుగూరు శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, మణుగూరు టౌన్ అధ్యక్షులు శివసైదులు, ఆలయ కమిటీ సభ్యులు, అశ్వాపు రం, మణుగూరు కాంగ్రెస్ నాయకులు  పాల్గొన్నారు.