13-02-2025 08:33:53 PM
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం తోగూడెం గ్రామంలోని మినీ మేడారం సమ్మక్క సారలమ్మలను నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గురువారం ఆదివాసి గిరిజన సాంప్రదాయ డోలు వాయిద్యాలు గిరిజన నృత్యాలు నడుమ సమీప రధం గుట్ట నుంచి సమ్మక్క తల్లిని ఆలయంలోని గద్దెల వద్దకు తీసుకువచ్చారు. గద్దలపై కొలువై ఉన్న సమ్మక్క సారలమ్మలను మణుగూరు సబ్ డివిజన్ లోని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ గిరిజన పూజారులు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో స్వాగతం పలికారు. సందర్భంగా ఎమ్మెల్యే పాయం వనదేవతలను మొక్కుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మాజీ ఎంపీపీ సాయం ప్రమీల, కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.