calender_icon.png 12 February, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మినీ మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే పాయం

12-02-2025 08:36:27 PM

మణుగూరు (విజయక్రాంతి): ఆదివాసి సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు ఆదివాసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం తోగ్గుడెం మినీ మేడారం సమ్మక్క-సారలమ్మలను బుధవారం పినపాక ఎమ్మెల్యే పాయం దర్శించుకున్నారు. ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఆదివాసి సాంప్రదాయ నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సమ్మక్క సారలమ్మ గద్దెలకు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ... తోగ్గుడెంలో ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే సమ్మక్క, సారలమ్మ జాతరలో పాల్గొని అమ్మవారులను దర్శించుకోవడం చాలా సంతోషకరమని, సమ్మక్క, సారలమ్మల దీవెనలు పినపాక నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని వనదేవతలను కోరుకున్నట్లు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, తోగ్గుడెం సమ్మక్క సారలమ్మ  ఆలయ కమిటీ సభ్యులు, ఆదివాసి పెద్దలు తదితరులు పాల్గొన్నారు.