మణుగూరు,(విజయక్రాంతి): ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని పెనపాక ఎమ్మెల్యే ఉపాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం తెలపాక నియోజకవర్గం పరిధిలోని అశ్వాపురం మండలం, కళ్యాణపురం గ్రామపంచాయితీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామ సభను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామసభలను ప్రభుత్వ అధికారులకు ప్రజలు సహకరించాలని ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లును కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లును అందిస్తామని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, అశ్వాపురం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.