బూర్గంపాడు,(విజయక్రాంతి): సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద 45 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు ఆదివారం రూ.16,75,000 విలువ గల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలోని పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, నియోజవర్గ బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి, నాయకులు భజన సతీష్, పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, కైపు లక్ష్మీనారాయణ రెడ్డి,భజన ప్రసాద్, మంద నాగరాజు తదితరులు పాల్గొన్నారు.