ఎమ్మెల్యేను ఆహ్వానించిన ఆలయ కమిటీ...
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని సమితి సింగారంలో నెలకొన్న శ్రీ సంకల్ప కార్యసిద్ధి నరసింహస్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు ఆహ్వానించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజాభవన్ లో ఎమ్మెల్యే పాయలను కలిసి ఆహ్వానం అందజేసిన సభ్యులు ఆలయానికి సంబంధించిన పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
ఆలయానికి సంబంధించి ప్రహరీ గోడ సమితి సింగారం ప్రధాన రహదారి నుంచి ఆలయం వరకు రోడ్డు సరిగా లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేని కోరగా.. స్పందించిన ఎమ్మెల్యే పాయం ప్రహరీ గోడ నిర్మాణానికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీని ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అర్చకులు అక్కినేపల్లి శ్యామ్, మణుగూరు నీలకంఠేశ్వర ఆలయ చైర్మన్ కూచిపూడి బాబు నాయకులు గణేష్ రెడ్డి, పాతూరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.