calender_icon.png 16 March, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భేటీ

15-03-2025 11:17:37 PM

అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం పట్ల హర్షం

ప్రతి పేద ఇంటి బిడ్డకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

మారుమూల నియోజకవర్గమైన పినపాకకు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు

ఏర్పాటుకు 200 కోట్ల నిధులు కేటాయించడం పట్ల హర్షం

శ్రీ సీతారామచంద్రస్వామి వారి తీర్థప్రసాదాలు అందజేత 

మణుగూరు (విజయక్రాంతి): ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తెలంగాణలో విద్యా వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి తీర్చిదిద్దుతున్నారని, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వెల్లడించారు. శనివారం ఆయన మీడియాకు శనివారం ప్రకటన విడుదల చేశారు. మారుమూల గిరిజన నియోజకవర్గమైన పినపాక నియోజకవర్గంకు నిరుపేద విద్యార్థుల ఉన్నత భవిష్యత్తును, దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల కోసం తాను చేసిన విజ్ఞప్తిని గుర్తించి, నియోజకవర్గానికి యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తూ, 200 కోట్ల  నిధులను ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారని ఆయన పేర్కొన్నారు. అందుకు కృతజ్ఞతా భావంగా సీఎం రేవంత్ రెడ్డితో తాను ప్రత్యేకంగా భేటీ అయి, నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపి, సీఎం రేవంత్ రెడ్డికి భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసినట్లు తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి చొరవతో నియోజక వర్గానికి మంజూరైన రెసిడెన్షియల్ స్కూల్ లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్య, సౌకర్యాలు కల్పిస్తామని సీఎం తెలిపారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రజా ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రకాల రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్నట్లు, వీటిని ఇకపై యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్ స్కూళ్లుగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంప్‌సలు ఏర్పాటు చేస్తారని, ఇందుకోసం రూ.5000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అలాగే మన నియోజకవర్గంలో ఏర్పాటు కానున్న స్కూలుకు 200 కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయని త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణలోని పాఠశాలల స్థితిగతులు మార్చేందుకు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణం చేపడుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేసేందుకు శక్తివంచ లేకుండా తాను కృషి చేస్తానని తెలిపారు.