calender_icon.png 3 February, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

29-01-2025 08:58:15 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో బుధవారం పర్యటించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా రూ.50 లక్షల అంచనా వ్యయంతో సాయినిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చిన్న వెంకటాపురం-జిన్నాల గుంపు సాయినిపల్లి, జగ్గయ్య గూడెం గ్రామాల్లో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. చిన్న వెంకటాపురం ఎంపీపీ ఎస్ పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

చిన్న వెంకటాపురం, మల్లెల గుంపు గ్రామాల మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. నాన్నతో ప్రమాణాలను పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్యలతో కలిసి కాంచనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బాబురావు నానమ్మ లక్ష్మి దశదినకర్మలకు హాజరయ్యారు. ఆళ్లపల్లి మండలంలో ఇటీవల గుండపోటుతో మృతి చెందిన పి.నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పర్యటనలో మండల తాహసీల్దార్ ఇమాన్యుల్, ఎంపీడీవో సత్యనారాయణ, మాజీ ఎంపీ చాట్ల పద్మ, మండల అధ్యక్షుడు ముత్యమా చారి, అశోక్, కదీర్ తదితరులు పాల్గొన్నారు.