calender_icon.png 3 February, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్ట్ 2024-25 క్రికెట్ టోర్నీ ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం...

03-02-2025 05:51:38 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోపాలపురం గ్రామంలో సోమవారం పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్ట్ కప్ 2024-25 క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో క్రికెట్ ఆడి రెండు టీముల సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పినపాక ప్రెస్ క్లబ్ సభ్యులు క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్న ప్రెస్ క్లబ్ సభ్యులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు పెద్దపీట వేసిందని, క్రీడాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం నుండి ఒక మహిళా క్రికెటర్ గొంగడి త్రిష మహిళ అండర్-19 విభాగంలో టి -20 క్రికెట్ వరల్డ్ కప్ లో తన అద్భుతమైన ఆటతో సెంచరీ సాధించి మహిళా అండర్-19 వరల్డ్ కప్ గెలుపులో తన పాత్ర చాలా కీలకమని, భారత్ విజయంతో యావత్ భారతావనికి, మహిళలోకానికి ఆదర్శంగా నిలిచిందన్నారు, త్రిషను ప్రతి క్రికెటర్ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా గోపాలపురం గ్రౌండ్ డెవలప్మెంట్ కొరకు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి గ్రౌండ్ అభివృద్ధికి పూర్తి సాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిసెల రామనాథం, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులు, కార్యకర్తలు, క్రీడాకారులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు