18-04-2025 10:15:25 PM
కళ్యాణ లక్ష్మి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే పాయం
పినపాక,(విజయక్రాంతి): పేద ఇంటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి ఒక వరం లాంటిదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆలస్యం లేకుండా దళారులకు తావివ్వకుండా వెంటనే అందజేస్తున్నామని పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన పినపాక మండలానికి చెందిన వికలాంగురాలు కొప్పుల స్వరూపకి కళ్యాణ లక్ష్మి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అద్దంకి నరేష్, ఎంపీడీవో సునీల్ కుమార్, కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ కళ్యాణి, మాజీ ప్రజా ప్రతినిధులు, పినపాక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.