మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం శుభకార్యక్రమాల్లో పాల్గొని బిజీ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా మణుగూరు ఏరియా పివి కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి మహంకాళి ఉదయ భాస్కర్, సువర్చలాదేవి దంపతుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి ఎమ్మెల్యే పాయం హాజరయ్యారు. ఈ వేడుకలో మండల అధ్యక్షులు తీరినకి నవీన్, సింగరేణి ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు వత్సవాయి కృష్ణంరాజు నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఎమ్మెల్యే బిజీ బిజీ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా కూనవరం మసీదు ఏరియాలోని కాటిబోయిన వీరయ్య, వెంకమ్మల మనమరాలి అన్నప్రాసన వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం మండల పరిధిలోని తోగ్గుడెం పంచాయతీ మాజీ వార్డు సభ్యులు సంధ్యారాణి- రమేష్ దంపతుల కుమారుడు నిహాల్ జన్మదిన వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. రామాంజవరం గ్రామపంచాయతీ పరిధిలో కొత్త మల్లేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు డేగల కృష్ణారావు జ్యోతి దంపతుల మనవరాలు ప్రేరిత, సంయుక్త ల చెవులు కుట్టించే కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.