calender_icon.png 19 April, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సు షెల్టర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

12-04-2025 05:50:41 PM

అశ్వాపురం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని రామచంద్రపురం బస్ స్టాప్ వద్ద ఐటీసీ వారి సహకారంతో నిర్మించిన బస్ షెల్టర్ ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఐటిసిసిఎస్ఆర్ నిధుల ద్వారా రూ.10 లక్షల నిర్మించిన బస్ షెల్టర్ ను లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రయాణికులు బస్ షెల్టర్ ను సద్వినియోగం చేసుకొని, పరిశుభ్రంగా ఉంచి వినియోగించుకోవాలని, ఊరికి దూరంగా ఉండటం వలన ప్రయాణికులకు ఎంతగానో ఈ బస్ షెల్టర్  ఉపయోగపడుతుందన్నారు. అనంతరం బస్సు షెల్టర్ వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఐటిసి మేనేజర్ చంగల్ రావు, తాసిల్దార్ స్వర్ణలత, ఎంపీ ఓ ముత్యాలరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదకేశవరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తూము రాఘవులు, భూ రెడ్డి వెంకట్ రెడ్డి, బేతం రామకృష్ణ, చుంచు ఏకాంబరం తదితరులు పాల్గొన్నారు.