calender_icon.png 3 February, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెటర్ త్రిషకు ఎమ్మెల్యే పాయం అభినందనలు..

03-02-2025 05:42:57 PM

మణుగూరు (విజయక్రాంతి): డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెట్టి రెండో సారి మహిళల అండర్-19 టీ-20 క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో దక్షిణాఫ్రికాను ఓడించి అంతర్జాతీయ స్థాయిలో తనదైన ప్రత్యేకతను చాటి దేశ, తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం ప్రాంత ఖ్యాతిని పెంచిన గొంగడి త్రిషకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. టోర్నీ మొత్తం తనదైన బ్యాటింగ్, బౌలింగ్ తో అద్భుత ప్రదర్శన చేసిన మన తెలంగాణ బిడ్డ అందులో మన భద్రాచలం కు చెందిన క్రికెటర్ గొంగడి త్రిష కావడం అందరికీ గర్వకారణం అన్నారు.  భారత మహిళల జట్టు భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని అండర్-19  టి 20 కప్ విజయంతో యావత్ భారతానికి, మహిళలోకానికి ఆదర్శంగా నిలిచిందని, భద్రాద్రి రాముని ఆశీస్సులతో భద్రాచలానికి ప్రపంచంలోనే ఓ కీర్తిని ప్రతిబింబించేలా చాటి చెప్పిన భారత అండర్-19 క్రికెట్ జట్టుకు క్రికెటర్ గొంగడి త్రిష అన్నారు.