22-02-2025 08:33:43 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గుడి(Pothuluri Veerabrahmendra Swamy Temple) కమిటీ ఆహ్వానం మేరకు శనివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) విచ్చేశారు. అనంతరం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి నూతనంగా ఎన్నుకోబడిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గుడి కమిటీ సభ్యులతో గుడిలో ప్రమాణ స్వీకారం చేయించారు. కమిటీ సభ్యులుగా ఎన్నికైన గుడి చైర్మన్ బాదం నాగిరెడ్డి, సెక్రెటరీ చింతా వెంకట నాగిరెడ్డి, ట్రెజరర్ పాశం రాజశేఖర్ రెడ్డి, పూజారి రవిశర్మ, కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సేంద్రియ పద్ధతిలో మిర్చి పంటను సాగుచేసిన రైతు యారం లక్ష్మిరెడ్డి అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,మండల అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి,మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,బాదం రమేష్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పలువురుకి ఎమ్మెల్యే పరామర్శ
బూర్గంపాడు మండల కేంద్రానికి చెందిన సుధనాల నాగేశ్వరరావు ఇటివలే అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న గొల్ల కోటేశ్వరరావుని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం యాదవ బజార్ కి అనారోగ్యంతో మృతి చెందిన గుడి శెట్టి వెంకన్న కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. గుండెపోటుతో మృతి చెందిన డేగల అక్కమ్మ, కేసుపాక శ్రీను ల కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎడమ కంటి రామకోటీ సతీమణి ఎడమ కంటి వెంకట సుబ్బమ్మ ఇటీవలే మరణించడంతో వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, రమేష్ రెడ్డి, కైపు శ్రీనివాస్ రెడ్డి, భజన సతీష్, ఇంగువ రమేష్, భజన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.