17-02-2025 06:53:35 PM
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శేషగిరి నగర్ ఆంజనేయ స్వామి గుడిలో సోమవారం నిర్వహించిన శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకల్లో పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతిజ్వాలను వెలిగించి నమస్కరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ.. బంజారాల కులదైవమైన శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ సేవలను గుర్తుచేస్తూ.. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, సేవాలాల్ సేన రాష్ట్ర కో-కన్వీనర్ బాణావత్ హుస్సేన్ నాయక్, సేవాలాల్ సేన మణుగూరు మండల.గౌరవ అధ్యక్షుడు గుగులోత్ రమేష్,,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, అజ్మీరా, నిర్మల మణుగూరు మండల అధ్యక్షుడు, గుగులోత్ రవికుమార్, మహిళ అధ్యక్షురాలు ఇస్లావత్, ద్వాలి, వైస్ ప్రెసిడెంట్ గుగులోత్ కవిత, అధికార ప్రతినిధి అజ్మీరా, రాజేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు, భూక్యా, బాలకృష్ణ, మండల కార్యదర్శి బానోత్, శాంతి,మండల ఉప అధ్యక్షుడు, ఇస్లావత్,శ్రీను మండల ప్రధాన కార్యదర్శి, భూక్యా, నాగేశ్వరావు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.