04-03-2025 04:32:25 PM
మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పీవీ కాలనీ శ్రీ వెంకటేశ్వర్ల స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి 10వ వార్షిక బ్రహ్మోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న హోమగుండంలో హోమ పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు వడ్డించారు. కార్యక్రమంలో మణుగూరు సిఐ సతీష్ కుమార్,మణుగూరు ఏరియా ప్రాతినిధ్య సంఘం, ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, బ్రాంచ్ సెక్రటరీ గట్టయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, మణుగూరు శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సింగరేణి కార్మికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.