calender_icon.png 4 February, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలప్పుడు మాత్రమే బీసీలు గుర్తుకు వస్తారు

04-02-2025 05:13:03 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలకు బీసీలు గుర్తుకు వస్తున్నారు అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాల చర్యలో భాగంగా ప్రశ్నించారు. బీసీల ఓట్లు పొందేందుకు మాత్రమే బీసీల నివాదం ఎత్తుకుంటున్నారు. ప్రభుత్వ వెబ్ సైట్ ప్రకారం రాష్ట్ర జనాభా 4.33 కోట్లు అని తెలుస్తోంది. కానీ ప్రస్తుంతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు రాష్ట్ర జనాభాకు పొంతనలేదని ఆరోపించారు. సర్వే ప్రకారం మాత్రం రాష్ట్ర జనాభా 3.76 కోట్లు అని చెప్తున్నారని పాయల్ శంకర్ మండిపడారు. జనాభా లెక్కల ప్రకారం బీసీలకు సగం సీట్లు ఇస్తామని రాజకీయ పార్టీలు చెప్తున్నాయని, కానీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ల కేటాయింపు దగ్గర నుంచే బీసీలకు అన్యాయం జరుగుతోందని పాయల్ శంకర్ వెల్లడించారు.