calender_icon.png 5 October, 2024 | 7:03 AM

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

04-09-2024 05:42:56 PM

వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పర్యటన... 

ఆదిలాబాద్,(విజయక్రాంతి): భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్ట పోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, రైతులకు పరిహారం అందే విధంగా తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు పంట నష్టపోయిన పెన్ గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా బేల మండలంలోని మాంగ్రుడ్, దేవుజి గూడా, ఖోగ్డుర్ తదితర గ్రామాల్లో పెన్ గంగ నది బ్యాక్ వాటర్ వల్ల నష్టపోయిన పంట పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను తెలుసుకొని, అధైర్యపడవద్దంటూ తాను ఉన్నానంటూ వారిలో ధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ నష్టపోయిన పంటలకు సంబంధించిన సర్వే నిర్వహించి, రైతులకు పరిహారం అందే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఫసల్ బీమా పథకం అమలు చేస్తే రైతులకు ఈ కష్టాలు ఉండేవి కావన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన అసలు బీమా పథకం అమలు చేయాలని అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడడం జరిగిందని గుర్తు చేశారు. పంటలు నష్టం వల్ల రైతుల బాధలు వర్ణాతీతంగా ఉందని, ఇప్పటికే పంటల కోసం చేసిన అప్పుల్లో ఉన్నారన్నారు. నష్టపోయిన రైతులకు సరిపడా పరిహారం ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబుని కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దయాకర్, మయూర్ చంద్ర, ముకుంద రావు, దత్తా నిక్కం, నవీన్, పోతరాజ్, ఇంద్ర శేఖర్, రాకేష్, దీప్ ఠాక్రే, నారాయణ్, మోరేశ్వర్, రాము బర్కడే, జీవన్, ప్రమోద్ రెడ్డి, అక్షయ్, తదితరులు పాల్గొన్నారు.