ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగతో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ సన్నాహక సమావేశంలో భాగంగా ఆదిలాబాద్ లో గురువారం నిర్వహించిన సమావేశానికి మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఆదిలాబాద్ కు వచ్చిన మందకృష్ణ మాదిగను ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగను ఎమ్మెల్యే పాయల్ శంకర్ శాలువాతో సత్కరించారు. అనంతరం వర్గీకరణతో పాటు జిల్లాకు సంబంధించిన రాజకీయ అంశాలపై కొద్దిసేపు ఇరువురు చర్చించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందం, నాయకులు మయూరి చంద్ర, విజయ్ తదితరులు పాల్గొన్నారు.