ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్,(విజయ క్రాంతి): విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి సాంకేతిక ప్రదర్శన, అవగాహన ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కలాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ అండ్ ఎక్సలెన్స్(Kalam Institute of Youth and Excellence) ఆధ్వర్యంలో గురువారం ఆదిలాబాద్ లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల(Little Flower School)లో నిర్వహించిన డిఫెన్స్ అండ్ స్పేస్ ఎక్స్ పోను ఎమ్మెల్యే ప్రారంభించారు. డిఫెన్స్ లో వినియోగించే రాకెట్లు, స్పెస్ లో ప్రయోగించిన శాటిలైట్ ఇతర వాటిని ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో మాట్లాడి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. మిస్సైల్ మాన్ అబ్దుల్ కలాం ను విద్యార్థుల ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన శాస్త్ర సాంకేతిక రంగంలో దేశానికి చేసిన సేవలను ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షులు పవన్ రావు, స్కూల్ ప్రిన్సిపాల్ పటాస్కర్, బీజేపీ నేతలు వేద వ్యాస్, బోయర్ విజయ్ తదితరులు ఉన్నారు.