ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ది చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేక తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమెల్యే పాయల శంకర్(MLA Payal Shankar) ధ్వజమెత్తారు. ఆదిలాబాద్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాయల శంకర్ శనివారం మాట్లాడారు. తాను 30 సంవత్సరాల నుండి ప్రజల మధ్యనే ఉంటూ ప్రజసేవ చేయడం వల్లనే తనకు ఈసారీ ఆదిలాబాద్ ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. ఆదిలాబాద్ ప్రాంతంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొన్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇన్‌చార్జ్ కంది శ్రీనివాస్ ఆరోపించడంపై తీవ్రంగా మండి పడ్డారు. తాను ఎక్కడ ప్రభుత్వ భూములను ఆక్రమించుకోలేదని ఆక్రమించుకొన్నట్టు నిరుపిస్తే తాను ప్రజలకు క్షమాపన చెపుతానన్నారు.
తాను చిన్నప్పటినుండి వ్యాపారాలు చేస్తు వచ్చిన లాహంలో కొంత ప్రజలకు సామాజిక సేవా చేస్తున్నమన్నారు. వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బు అక్రమం ఎలా అవుతుందన్నారు. కంది శ్రీనివాస్ తన రాజకీయ ఉనికి కోసం తనపై వ్యక్తిగత ఆరోపనలు చేస్తున్నారని దమ్ముంటే ఆక్రమాలు భయట పెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆయన క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. జోగు రామన్న తాను ఒక్కటే అని పదే పదే చెప్పుతున్న ఆయన ఎందుతో ఒకటో చెప్పాలని కోరారు. భూ ఆక్రమణలపై దేనికైన సిద్దం అన్నారు. తాను ఏతప్పు చేయాలేదని కాంగ్రెష్ పార్టీ నేతలు ఇటువంటి ఆరోపనలు చేస్తే చట్టపరంగా చర్యలతీసుకునేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. రాజకీయంలో ఉన్నంత కాలం తాను నిజాయితీగా బ్రతుకుతానని పేర్కోన్నారు. కంది శ్రీనివాస్ చరిత్ర ఆదిలాబాదు ప్రజలకు తెలసు అని అందుకే ఎన్నికల్లో ఆయనకు ప్రజలు అవకాశం ఇవ్వలేదన్నారు. ఈ కార్యాక్రమంలో పార్టీ నేతలు భ్రహ్మనందం, తదితరులు ఉన్నారు.