calender_icon.png 30 April, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త సీఎస్‌ను కలిసిన ఎమ్మెల్యే పాయల్

29-04-2025 12:00:00 AM

కలెక్టర్‌గా పని చేసిన రోజులను నెమరువేసుకున్న ఎమ్మెల్యే

ఆదిలాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాం తి): కొత్తగా నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో సోమవారం ప్రధాన కార్యదర్శిని కలిసిన ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు.

అప్పుడు కలెక్టర్‌గా వరదల సమయంలో ద్విచక్రవాహనంపై తిరిగి జిల్లా ప్రజ ల్లో ఎంతో ధైర్యం నింపారని ఎమ్మెల్యే పాత రోజులను నెమరు వేసుకున్నారు. తాను సర్పంచ్‌గా ఉన్నపుడు కలెక్టర్‌గా పనిచేసిన రామకృష్ణరావు సేవలను కొనియాడారు. జిల్లాలో పనిచేసిన వ్యక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావడం ఎంతో గర్వంగా ఉందని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు.