29-03-2025 11:11:25 PM
మంచిర్యాల (విజయక్రాంతి): రంజాన్ ఉపవాస దీక్షలో ఉండే ముస్లింల కోసం శని వారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ సాగరం, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లు పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.