calender_icon.png 19 April, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

12-04-2025 06:43:43 PM

నారాయణఖేడ్: హనుమాన్ జయంతి సందర్భంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. నారాయణఖేడ్ పట్టణంలోని కల్ప ఆంజనేయ ఆలయంతో పాటు, ప్రసిద్ధి చెందిన కొండాపూర్ హనుమాన్ ఆశ్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్ ప్రత్యేక స్వాగతం పలికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

కాగా కొండాపూర్ ఆశ్రమానికి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హనుమాన్ దీక్ష దారులు 41 రోజు దీక్ష మాలను విరమించారు. ఆశ్రమాన్ని మాజీ ఎంపీ బీబీ పాటిల్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడి సంగప్ప సందర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. జయంతి వేడుకల్లో డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సుధాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, నాయకులు పండగ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.